ముద్రగడ నివాసానికి వైసీపీ నేతలు
కాపు ఉద్యమ నేత ముద్రగడ ఇంటిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. వైసీపీ జిల్లా అధ్యక్షులు కన్నబాబు, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి, వంగా గీతా విశ్వనాథ్ ముద్రగడ నివాసానికి వచ్చారు. ధ్వంసమైన కారును పరిశీలించారు. ఘటన ఏ విధంగా జరిగిందని ముద్రగడను అడిగి తెలుసుకున్నారు.
కన్నబాబు మాట్లాడుతూ.. ముద్రగడ ఇంటి దగ్గర విధ్వంసం సృష్టించి కారు మీద దాడి చేశారని తెలిపారు. ప్రభుత్వం ఉదాసీనత వలన ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాలికి వదిలేశారని ఆరోపించారు. దాడి చేసిన వ్యక్తి తాను జనసేన అని చెబుతున్నాడని, రెడ్ బుక్ రాజ్యాంగం వలన ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు.