కాకినాడ బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో భారీ పేలుడు

Offbeat Published On : Monday, March 3, 2025 12:38 PM

ఏపీలోని కాకినాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాలాజీ ఎక్స్‌పోర్ట్స్ వద్ద హమాలీలు క్రాకర్స్ లోడ్ దింపుతుండగా భారీ పేలుడు చోటు చేసుకుంది.స్థానిక వార్పు రోడ్డులోని జై బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో పార్సిల్‌ దింపుతుండగా ఈ పేలుడు చోటుచేసుకుంది. పేలుడు ధాటికి భారీ శబ్దం రావడంతో హమాలీలు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు సంభవించేందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.