హోలీ ఆచారం: కొత్త అల్లుడిని గాడిదపై ఊరేగిస్తారు..!
హోలీ సందర్భంగా మహారాష్ట్రలోని ఓ గ్రామంలో 86 ఏళ్లుగా ఓ వింత ఆచారం కొనసాగుతోంది. బీడ్ జిల్లా విడా గ్రామంలో హోలీ రోజు కొత్త అల్లుడిని గాడిదపై ఊరేగిస్తారు. సమీప ప్రాంతాల ప్రజలు భారీగా అక్కడికి వచ్చి కొత్త అల్లుడికి బహుమతులు కూడా అందిస్తారు. ఆ ఆచారానికి ఓ పెద్ద కథే ఉంది.
పూర్వం ఆ ఊరి పెద్ద దేశముఖ్ ఆనందరావు అల్లుడు హోలీ ఆడటానికి ఒప్పుకోలేదు. దాంతో అతనికి నచ్చజెప్పి గాడిదపై ఊరేగించి హోలీ నిర్వహించారని, అప్పట్నుంచి ఆ వేడుక ఇక్కడ కొనసాగుతోందని అక్కడి స్థానికులు చెబుతారు.