ఫోన్ లో ఇలాంటివి చూస్తే జైలుకే.. గూగుల్ రూల్స్
గూగుల్ లో వాటి గురించి వెతికితే జైలుకు వెళ్ళాల్సిందే. గూగుల్ దగ్గర అన్నిటికీ సమాధానాలుంటాయి. కానీ కొన్ని ప్రశ్నలు అడిగితే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. కొన్ని సెర్చ్ ల విషయంలో గూగుల్ కఠినంగా వ్యవహరిస్తుంది, వాటిని అనుమతించదు. బాంబు ఎలా తయారు చేయాలో వెతికితే నేరం కిందకు వస్తుంది. భద్రతా సంస్థలు వీటిపై నిఘా పెడతాయి. పట్టుకుంటే జైలుకి వెళ్లాల్సి వస్తుంది.
ఏదైనా చైల్డ్ పోర్నోగ్రఫీ సమాచారం వెతికితే కూడా అరెస్ట్ కాక తప్పదు. హ్యాకింగ్ ట్యుటోరియల్స్, సాఫ్ట్‌వేర్ గురించిన సమాచారం గూగుల్‌లో వెతకడం కూడా నేరమే. ఫ్రీ మూవీస్ వెతికితే జైలు శిక్ష, పది లక్షల జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష కూడా పడుతుంది. గర్భస్రావం గురించి గానీ, బాలలపై వేధింపులకు సంబంధించినవి గూగుల్‌లో వెతకకూడదు.