హనీట్రాప్ లో ఇరుక్కున్న 48 మంది రాజకీయ నాయకులు

Politics Published On : Friday, March 21, 2025 10:39 AM

జాతీయ స్థాయి నేతలు సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ ఉచ్చులో పడ్డారని కర్నాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశారు. 48 మంది నాయకుల అసభ్య వీడియోలు సీడీలు, పెన్ డ్రైవ్ లో ఉన్నాయని, ఇందులో అధికార, విపక్ష పార్టీ సభ్యులు ఉన్నారని తెలిపారు. దీనిపై హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని, దీని వెనక ఎవరు ఉన్నారనే విషయం ప్రజలకు కూడా తెలియాలని స్పష్టం చేశారు.

ఒక మంత్రిపై రెండుసార్లు హనీ ట్రాప్ యత్నం జరిగిందని, ఇది కొత్త కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటున్నారని మరో మంత్రి సతీశ్ జారి హోళీ అన్నారు. ఈ కేసులో ఎవరినైనా అరెస్టు చేశారో లేదో తనకు తెలియదని, దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు బయటకు వస్తాయని డిప్యూటి సీఎం డీకే శివకుమార్ స్పందించారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...