ఏపీ రాజకీయాలు దరిద్రం: నటి పూనం
ఏపీలో జరుగుతున్న పరిణామాలపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. పోసాని కృష్ణమురళి ఆరోగ్యంపై ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో రాజకీయాలు దరిద్రంగా ఉన్నాయని ఆమె ట్వీట్ చేశారు.
బలహీనమైన కేసులు పెట్టి ప్రతీకారం తీర్చుకోవడానికి వ్యక్తులను ఎత్తుకెళ్లడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. పోసాని ఆరోగ్యం పట్ల తనకు దిగులుగా ఉందని, ఆయన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరముందని డిమాండ్ చేశారు.