క్రిమినల్ కేసుల్లో టీడీపీ ఎమ్మెల్యేలే టాప్..!
దేశంలో క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేల జాబితాలో టీడీపీ అగ్రస్థానంలో ఉన్నట్లు ADR నివేదిక వెల్లడించింది. 134 మందికిగాను 115 మంది (86 శాతం)పై క్రిమినల్ కేసులు, 82 మంది (61 శాతం)పై తీవ్రమైన కేసులు ఉన్నట్లు పేర్కొంది.
ఇక 1,653 మంది బీజేపీ ఎమ్మెల్యేలకుగాను 638 మంది (39 శాతం)పై కేసులు ఉన్నట్లు తెలిపింది. 52 శాతం మంది కాంగ్రెస్ (646 మందిలో 339 మందిపై), 41 శాతం TMC (230 మందిలో 95 మంది) ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించింది.