వారిద్దరూ క్షేమంగా తిరిగొచ్చి టీడీపీని ఎదురిస్తారు: అంబటి రాంబాబు
మాజీ మంత్రి కొడాలి నాని గుండె సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ పలు రకాలుగా ట్రోల్ చేస్తుండటంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. గుండె ఆపరేషన్ కోసం ముంబై వెళ్లారని తెలిపారు.
ఆయన ఆరోగ్యం విషమించిందంటూ టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని అభిమానులకు సూచించారు. కొడాలి నాని, వంశీ ధైర్యాన్ని కోల్పోయే నేతలు కాదని అన్నారు. వారిద్దరూ త్వరలోనే క్షేమంగా తిరిగొచ్చి టీడీపీని ఎదిరిస్తారని వ్యాఖ్యలు చేశారు.