వల్లభనేని వంశీ ఉక్కిరిబిక్కిరి ? కస్టడీ, పీటీ వారెంట్, సిట్ దర్యాప్తు..!
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరంలో తమ పేరిట ఉన్న రూ.10 కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారని హైకోర్టు లాయర్ సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో వంశీతో పాటు మరో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటికే జైలులో ఉన్న వంశీపై అక్రమ మైనింగ్, భూకబ్జాల ఆరోపణలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.