ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో క్రిమినల్స్ ఉంటే ఇలాంటివే జరుగుతాయని చెప్పారు. టీటీడీ గోశాల, వక్స్ చట్టం, పాస్టర్ ప్రవీణ్ మృతిపై జరిగిన దుష్ప్రచారంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై కొందరు కుట్రలు పన్ని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో మతకలహాలు తేవాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు చాలా కుయుక్తులు పన్నుతున్నారని తెలిపారు.