అధికార పార్టీ ఒత్తిడితో అల్లం సత్యనారాయణపై తప్పుడు కేసు

Politics Published On : Monday, December 30, 2024 11:56 PM

అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో పోలీసులు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. వైసిపి మాజీ ఎమ్మెల్యే అనుచరుడిపై తప్పుడు కేసులు బనాయించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా అటు సోషల్ మీడియా కార్యక్తలను ఇటు పార్టీగా అండగా ఉండే పార్టీ కార్యకర్తలపై ఇష్టానుసారంగా కేసులు బనాయించి అధికార పార్టీ నేతలు పోలీసులతో చేతులు కలిపి అక్రమ కేసులు బనాయిస్తున్నారు.

జమ్మలమడుగు నియోజకవర్గంలో గత వైసిపి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న మూలె సుధీర్ రెడ్డికి ఏటూరు గ్రామానికి చెందిన అల్లం సత్య నారాయణ ప్రధాన అనుచరుడు. అయితే, వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత నియోజకవర్గంలోని ప్రధాన వైసీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి పైశాచిక ఆనందం పొందడానికి అధికార పార్టీ నేతలు తెగబడుతున్నారు. వీరికి పోలీసుల అండదండలు ఉండటం కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

భార్యాభర్తల పంచాయితీని అడ్డంపెట్టుకొని అక్రమ కేసులు:
అల్ల సత్యనారాయణ భార్యను బెదిరించి భర్తపై గృహ హింస కేసు పెట్టేలా ఒత్తిడి తెచ్చారు. భర్త ప్రాణాలకు హాని కలుగుతుందని భయపడి సొంత భర్తపై గృహ హింస కేసు పెట్టడానికి స్టేషన్ కు వెళ్లింది. అయితే అధికార పార్టీ ఒత్తిడి ఎక్కువ కావడంతో, ఏ అక్రమాలు చేయని సత్య మీద కేసు పెట్టడానికి వీలుపడని పోలీసులు ఇప్పుడు అతని భార్య ఇచ్చిన గృహ హింస కేసును అడ్డుగా పెట్టుకుని, తాళ్ళ ప్రొద్దుటూరు పోలీసులు వారికి ఇష్టం వచ్చినట్లుగా హత్యాయత్నం కింద 324 సెక్షన్ తో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. సోమవారం ఉదయం పోలీసులు ఫోన్ చేయడంతో వెళ్ళాడు. ఉదయం నుండి అతనిని  కోర్టులో ప్రవేశ పెట్టకపోగా ఆయనను ఎవరూ కలిసేందుకు వీలు లేకుండా కానిస్టేబుళ్లను కాపలా పెట్టారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోనే కక్ష సాధింపుగా తప్పుడు కేసులు పెడుతున్నారని నియోజకవర్గ వైసిపి నాయకులు, కార్యకర్తలు మరియు కుటుంబ సంభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో లోకేష్ రెడ్ బుక్ అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ పంతం కోసం తప్పుడు కేసులు అమాయక కార్యకర్తలను వేధిస్తున్నారని పలువురి అభిప్రాయం