అసెంబ్లీలో జగన్ అటెండెన్స్ చెల్లదు
జగన్ తో పాటు వైసిపి ఎమ్మెల్యేకు భారీ షాక్ తగిలింది. శాసన సభ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా వైసిపి ఎమ్మెల్యేలు సభలోకి వచ్చారు. ఆయన ప్రసంగం మొదలుబెట్టిన 11నిమిషాలకే సభ నుంచి వాకౌట్ చేసారు. ఇంకో 60 రోజులపాటు అసెంబ్లీ గడప తొక్కే పనిలేదు అంటూ వైసిపి నేతలు అనుకున్నారు.
కానీ అసెంబ్లీ అధికారులు జగన్ తో పాటు ఏ సభ్యుడి అటెండెన్స్ చెల్లదని వారు తేల్చి చెప్పారు. టెక్నికల్ గా లెక్కలోకి రాదని బాంబు పేల్చారు. అంతేకాదు మంగళవారం నుంచి స్పీకర్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశాలు తొలిరోజు సమావేశాలు అవుతాయని, ఆ రోజు నుండి అటెండెన్స్ పరిగణలోకి తీసుకుంటామని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో, అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు పది నిమిషాల పాటు సభకు వచ్చిన జగన్ కు షాక్ తగిలినట్లయింది.