ఔరంగజేబ్ సమాధి తొలగించండి: నవనీత్ కౌర్
ఔరంగజేబ్ సమాధి తొలగించండి అంటూ బీజేపీ నేత నవనీత్ కౌర్ డిమాండ్ చేశారు. మొగల్ రాజు మందిరాలు నిర్మించాడని, ఆయన పరిపాలన బాగుండేదని మహారాష్ట్ర సమాజ్వాదీ పార్టీ చీఫ్ అబూ అజ్మీ అన్నారు. దీంతో అబూ అజ్మీ వ్యాఖ్యలపై ఆమె ఫైర్ అయ్యారు.
శివాజీ మహారాజ్ రాష్ట్రంలో ఔరంగజేబును పొగడటం ఏంటని ప్రశ్నించారు. ఔరంగజేబ్ సమాధిని రాష్ట్రం నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయనను ఇష్టపడే వారింట్లో ఏర్పాటు చేసుకోమని తెలిపారు. అతని దాష్టీకాలు తెలియాలంటే ఛావా సినిమా చూడాలని సూచించారు.