బీజేపీ తరఫున గెలుపొందిన రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు: కేటీఆర్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. గతంలో ఇండియా టుడేతో మాట్లాడిన వీడియోను పంచుకున్నారు.
'రాహుల్ గాంధీ ఉండగా బీజేపీని ఓడించడం కాంగ్రెస్ కు సాధ్యం కాదు. ఇండియాలో మోదీకి అతిపెద్ద కార్యకర్త రాహులే. ఇక్కడ ఆయన ఉన్నన్ని రోజులు మోదీని ఆపలేరు. రీజనల్ పార్టీ నేతలు మాత్రమే మోదీని ఆపగలరు' అంటూ వీడియోలో సెటైర్లు వేశారు.