ఆయనే డిప్యూటీ సిఎం..స్పష్టం చేసిన చంద్రబాబు
గత వారం రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ను ప్రకటించాలని టీడీపీ ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు, నారా లోకేష్ దావోస్ పర్యటనలో ఉన్నారు. సోషల్ మీడియా లో జరుగుతున్న ఈ రచ్చ చంద్రబాబు వరకు చేరడంతో ఆయన టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంత గొడవ జరుగుతుంటే ఏమి చేస్తున్నారని ఫోన్ ద్వారా నిలదీసినట్లు తెలుస్తోంది. "మీ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు, అతి చేస్తే తోకలు కత్తిరిస్తాను" అంటూ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.