వర్మకు చంద్రబాబు బంపర్ ఆఫర్
ఏపీ రాజకీయాలు కూటమి పార్టీల ప్రభావంతో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా పిఠాపురంలో జనం రాజకీయాలపై ఉత్కంఠగా చర్చించుకుంటున్నారు. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో వర్మ గతంలో సీటు వదులుకున్నారు. ఇప్పుడు ఆయనకు న్యాయం జరగలేదనే ఆరోపణలతో ఆయన మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినా ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇప్పటివరకు రాలేదు. ఈ నేపథ్యంలో TDP నుండి వర్మకు కొత్తగా ఓ కీలక నియోజకవర్గ బాధ్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.