నెక్ట్స్ టార్గెట్ నువ్వేరా.. హైపర్ ఆదిపై ఫోకస్

Politics Published On : Saturday, February 15, 2025 06:00 PM

లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 11 మేకల కామెంట్లు చేసి కమెడియన్ పృథ్వీరాజ్ టార్గెట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే మరో కమెడియన్ హైపర్ ఆది టార్గెట్ అవుతున్నాడు. సోషల్ మీడియా వేదికగా “నెక్స్ట్ టార్గెట్ నువ్వే… ఈసారి స్ట్రాంగ్ గా ఇస్తాం నీకు” అంటూ హైపర్ ఆదికి వార్నింగ్ మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు కొంత మంది. గతంలో హైపర్ ఆది కామెంట్స్ చేసిన వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.

ఆ వైరల్ వీడియోలో హైపర్ ఆది కూడా అచ్చం పృథ్వీలాగే 11 మంది అంటూ సెటైర్స్ పేల్చాడు. ‘కమిటీ కుర్రోళ్ళు’ మూవీ ఈవెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ “నిహారిక వాళ్ళ బాబాయ్ గారిలాగే… ట్రెండ్ ఫాలో అవ్వదు, సెట్ చేస్తుంది. అందుకే ఏకంగా 11 మంది హీరోలని పెట్టి సినిమా తీసింది. రీసెంట్ గా 11 మంది క్రికెటర్లు మన దేశానికి వరల్డ్ కప్ తెచ్చినట్టు, ఈ 11 మంది హీరోలు నిహారికకు మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. మనకు 11 అంటే చాలా గుర్తొస్తాయి. కానీ ఈ సినిమా తర్వాత మాత్రం ఈ హీరోలే గుర్తుకు వస్తారు. అదైతే నేను నమ్ముతాను” అంటూ హైపర్ ఆది కామెంట్స్ చేసిన వీడియోలు అవుతున్నాయి.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...