జీరో.. జీరో.. జీరో.. కాంగ్రెస్ హ్యాట్రిక్ జీరో..
కాంగ్రెస్ దుస్థితి జీరో, జీరో.. మరో జీరోకు మారిపోయింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మూడు సార్లు అసలు ఒక్క సీటు కూడా సాధించలేదు. ఢిల్లీ అసెంబ్లీకి 1952-2020 మధ్య ఎనిమిదిసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 4సార్లు గెలిచింది.
అలాంటి పార్టీ ఇప్పుడు అక్కడ ఖాతా తెరవలేదు. 2015, 2020 ఎన్నికల్లో సున్నాకే పరిమితమైన గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఈసారీ పేలవ ప్రదర్శన చేసింది. కేవలం ఒకే ఒక్కచోట స్వల్ప ఆధిక్యతతో ఊగిసలాడి చివరకు ఆ స్థానాన్ని కూడా కోల్పోయింది. దీంతో హ్యాట్రిక్ డకౌట్ ఖాయంగా మారింది.