భాషా వివాదంపై మరో సారి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
భాషా వివాదంపై మరో సారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన రేఖలు లేకుండా భారతదేశం మరింత ఐక్యంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఓ తమిళ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సాంస్కృతిక సమైక్యత కోసం నార్త్ ఇండియన్స్ కూడా దక్షిణాది రాష్ట్రాల భాషలైన తెలుగు, కన్నడ, తమిళ్ ను అర్థం చేసుకోవాలని, ఇక్కడి వారు హిందీ వద్దనుకుంటే మరో భాషను నేర్చుకోండి అంటూ తెలిపారు. ఇందులో కొన్ని సమస్యలున్నప్పటికీ అవి విభజనకు దారి తీయకూడదని పేర్కొన్నారు.