జనసైనికులకు పవన్ కళ్యాణ్ కీలక విజ్ఞప్తి

Politics Published On : Sunday, January 26, 2025 10:30 PM

జనసైనికులకు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్డీయే శ్రేణులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడేలా బాధ్యతగా ఉండాలని కోరారు. అనవసర వివాదాలు, విభేదాల జోలికి వెళ్లవద్దని సూచించారు. 

తప్పుడు వార్తలపై, కూటమి అంతర్గత విషయాలపై ఎవరైనా స్పందించినా దయచేసి ఎవరూ ప్రతిస్పందనగా వ్యక్తిగత అభిప్రాయాలు వెలిబుచ్చవద్దని కోరారు. తాను ఏ రోజూ పదవుల కోసం రాజకీయం చేయలేదని, భవిష్యత్తులోనూ చేయనని పవన్ ఆ ప్రకటనలో వెల్లడించారు.