చంద్రబాబు ఆ పదవి అడిగారు.. కానీ మోడీ ఒప్పుకోలేదు
చంద్రబాబు ఆ పదవి అడిగితే మోదీ ఒప్పుకోలేదు అంటూ మాజీ ప్రధాని దేవెగౌడ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ చంద్రబాబు బీజేపీకి మద్దతు ఇచ్చాక ఎన్డీయే వైస్-ఛైర్మన్ పదవి అడిగారని తెలిపారు. అయితే అందుకు మోదీ ఒప్పుకోలేదని అన్నారు.
దేవెగౌడ వ్యాఖ్యలను కేంద్రమంత్రి, బీజేపీ చీఫ్ నడ్డా వెంటనే ఖండించారు. ఎన్డీయే నాయకత్వంపై ఎలాంటి చర్చ జరగలేదని వెల్లడించారు. కూటమిలోని అన్ని పార్టీలు మోదీ నాయకత్వంలో పని చేసేందుకు అంగీకరించాయని స్పష్టం చేశారు.