అప్పటికి పవన్ ఇంకా పుట్టలేదేమో: డిఎంకె కౌంటర్
కాకినాడ జిల్లాలో నిర్వహించిన జనసేన జయకేతనం సభలో తమిళ సినిమాలను హిందీలో ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు DMK కౌంటరిచ్చింది.
త్రిభాషా విధానాన్ని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారని ఆ పార్టీ నేత సయీద్ హఫీజుల్లా తెలిపారు. కేంద్రం తమపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోందని అన్నారు. తమిళనాడు ద్విభాషా విధానాన్ని పాటిస్తోందని, దీనిపై బిల్లు చేసి 1968లోనే అసెంబ్లీ పాస్ చేసిందని, అప్పటికి పవన్ ఇంకా పుట్టలేదేమో అని ఎద్దేవా చేశారు.