పవన్ కళ్యాణ్ కు డిఎంకె ఎంపీ కనిమొళి కౌంటర్
దేశంలో బహు భాషలు అవసరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్ సోదరి, డిఎంకె ఎంపీ కనిమొళి కనిమొళి కౌంటర్ ఇచ్చారు. భాషాపరమైన అడ్డంకులు లేకుండా సినిమాలు చూసేందుకు టెక్నాలజీ సాయపడుతుందని తెలిపారు.
గతంలో 'హిందీ గోబ్యాక్!' ఆర్టికల్ ను షేర్ చేస్తూ పవన్ పెట్టిన ట్వీట్, నిన్న 'తమిళ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారు' అని ప్రశ్నించిన వీడియో స్క్రీన్ శాట్ పోస్ట్ చేశారు. బీజేపీలో చేరక ముందు, చేరాకా అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. కేంద్ర తీసుకురావాలని చూస్తున్న త్రి భాషా విధానాన్ని తమిళనాడు ముందు నుండి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.