ఆన్ లైన్ లో మొక్కులు చెల్లిస్తున్న శ్రీవారి భక్తులు, లాక్ డౌన్ లో టీటీడీ ఆదాయం ఎంతో తెలుసా..

Politics Published On : Tuesday, May 19, 2020 12:27 PM

కరోనా దెబ్బ కలియుగ వైకుంఠ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుపతి ఆలయం మీద కూడా పడింది. ఆలయంలోకి భక్తుల ప్రవేశాలు నిషేధించిన విషయం మనకి తెలిసిందే .ఇక ఇటీవల సామాజిక దూరం పాటిస్తూ చాలా మార్పులు చేసి దర్శనాలకు అనుమతి ఇస్తారని వార్తలు వచ్చాయి. అయితే కేంద్రం ఇచ్చిన కొత్త నిబంధనలతో అది సాధ్యంకాదని ఈ నెలాఖరు వరకు భక్తులకు దర్శనాలు కుదరవని టీటీడీ చెపింది .

కానీ నిత్యం స్వామివారి జరగవలిసిన కైంకర్యాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఇక ఈనెల 28వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశంలో తదుపరి దర్శనాల విషయంలో నిర్ణయం తీసుకుంటారు. కరోనా కష్టకాలంలో కూడా స్వామివారి మీద భక్తి ఏ మాత్రం తగ్గలేదని కొందరు భక్తులు నిరూపించుకుంటున్నారు. భక్తులు ఆన్ లైన్ ద్వారా స్వామివారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ తిరుమల శ్రీవారి ఆదాయం ఏమాత్రం తగ్గలేదని సమాచారం.

గతేడాది ఏప్రిల్‌లో తిరుమల శ్రీవారికి ఆన్‌లైన్ ద్వారా రూ.90 లక్షల ఆదాయం సమకూరింది. ఈ ఏప్రిల్‌లో నమోదైన హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా లాక్‌డౌన్‌తో 59 రోజుల పాటు శ్రీవారికి భక్తులు దూరమైనా శ్రీవారికి కానుకలు మాత్రం ఆన్‌లైన్ హుండీ ద్వారా పంపుతున్నారు.