Raghunandan rao: వైఎస్సార్ అభిమానులు నన్ను క్షమించాలని కోరిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు 

Politics Published On : Friday, January 1, 2021 03:15 PM

Hyd, Nov 23: దివగంత ముఖ్యమంత్రి మహా నేత వైస్సార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రఘునందన్ రావు ఎట్టకేలకు సారీ చెప్పారు. వైఎస్సార్ అభిమానులంతా నన్ను క్షమించాలని వీడియోని విడుదల చేశారు. వైఎస్సార్ మహా నాయకుడు ఆయన పెట్టిన పథకాలు మంచివి అని నేను చాలా సార్లు చెప్పాను ఆయన్ని కించ పరిచే విధంగా నేను ఎన్నడు మాట్లాడ లేదు. నిన్న ప్రెస్ మీట్ పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆయన పథకాలను అభిమానులు ఓ సారి గుర్తు చేసుకోండని వీడియోలో తెలిపారు. 
 
వెనుకటికి ఒకడుండేవాడు. పావురాల గుట్టల్లో పావురమైపోయిండు. మీకు అదే గతి పడుతుంది.నేను సైన్స్‌ టీచర్‌ను. యాక్షన్‌కు రియాక్షన్‌ ఉంటుంది. టీఆర్‌ఎస్‌ నాయకత్వంపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శలు (Raghunandan Rao Comments Over YSR Death) గుప్పించారు. అయితే ఇక్కడ వైఎస్సార్ ప్రస్తావన తీసుకురావడంతో ఆయన అభిమానులు ఎమ్మెల్యేపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. దివంగత ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన నీచత్వానికి, పిచ్చికి పరాకాష్ట అని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గతంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ పావురాల గుట్టవద్ద జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి (Dr. YS Rajasekhara Reddy) దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. 

తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో (GHMC Elections 2020) భాగంగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు (dubbak bjp mla raghunandan rao) ఆదివారం మీడియాసమావేశంలో  టీఆర్‌ఎస్‌ నాయకులను  వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని పోల్చుతూ  ఈ విధంగా అభ్యంతరకర వ్యాఖ్యలుచేశారు. కాగా రఘునందన్‌రావు వాఖ్యలపై తెలంగాణ సమాజం మండిపడింది. తెలంగాణ అస్తిత్వానికి ప్రతిబింబాలైన టీఆర్‌ఎస్‌ అగ్రనాయకులపై నీచవ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దమ్ముంటే ఎన్నికల్లో ఎదుర్కొవాలి తప్ప, ఇలా దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.  బీజేపీ నేతలకు బుద్ధిచెప్తామని హెచ్చరించారు. రఘునందన్‌రావు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఏపీ అధికార వైసీపీ నేతలు సైతం మండిపడుతున్నారు. మీరు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రాజకీయం చేయాలనుకుంటే.. మీ ప్రత్యర్థి పార్టీలను విమర్శించుకోండి. మీ రాజకీయం కోసం మీరు గుడికే వెళ్తారో, గుండే కొట్టించుకుంటారో మాకు అనవసరం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గురించి కానీ, వైఎస్‌ కుటుంబం గురించి కానీ మాట్లాడే అర్హత మీకులేదు. వారి కాలిగోటికి సరిపోదు మీ జీవితం. కొత్తబిచ్చగాడు పొద్దెరగనట్టుగా మీరు ఇష్టానుసారం మాట్లాడొద్దంటూ మండిపడ్డారు. 

రఘునందన్‌రావు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రజల సమక్షంలోకి వెళ్లి వారికి ఏంచేస్తామో చెప్పి ఓట్లను అభ్యర్థించాలే, తప్ప దిగజారుడు రాజకీయాలకు పాల్పడటమేమిటని మండిపడుతున్నారు. చనిపోయిన వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడకూడదనే ఇంగితజ్ఞానం కూడా లేని మనిషికి ఇదే తొలిసారి, చివరిసారి గెలుపని కొందరు ధ్వజమెత్తారు.