జగన్ ఓడిపోలేదు: సినీ నటుడు సుమన్

Politics Published On : Wednesday, March 12, 2025 01:00 PM

సినీ నటుడు సుమన్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చెత్తగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను వైసీపీ హయాంలో ప్రైవేట్‌ పాఠశాలను అద్భుతంగా చేశారని చెప్పారు. డిజిటల్‌ బోర్డులు, టాయిలెట్స్‌ మెరుగుపరిచారన్నారు. పేదలకు నేరుగా ఇంటికే పెన్షన్‌ అందించారని, ఇవన్నీ జగన్‌ ప్రభుత్వంలో తనకు నచ్చాయని సుమన్‌ తెలిపారు. అయితే కొన్ని ప్లస్‌, కొన్ని మైనస్‌ పాయింట్స్‌ ఉన్నాయని, తన దృష్టిలో జగన్‌ ఓడిపోలేదని తెలిపారు.

ఓవైపు మోడీ, పవన్‌, చంద్రబాబును ఎదుర్కొన్న జగన్‌ చాలా టఫ్‌ ఫైట్ ఇచ్చారని, తక్కువ మార్జిన్‌తో ఓడిపోయారని అన్నారు. జగన్‌ హయాంలో విద్య, వైద్యం, పెన్షన్‌ పథకాలు బాగా అమలు చేశారని, కరోనా సమయంలో జగన్‌ చాలా బాగా హాండిల్‌ చేశారని సుమన్‌ ప్రశంసలు కురిపించారు. దీంతో వైసీపీ అభిమానులు సుమన్‌ వీడియోను తెగ వైరల్‌ చేస్తున్నారు.

సోఫియా అన్సారీ హాట్ ఫోటోస్

See Full Gallery Here...