ఈ సారి జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోతే.. సీటు ఖాళీనే
మాజీ సీఎం జగన్ మరోసారి అసెంబ్లీకి రాక తప్పదని తెలుస్తోంది. ఇవాళ అసెంబ్లీ సెషన్లో సభ్యులు చేసిన సంతకాలను పరిగణనలోకి తీసుకోరని సమాచారం. గవర్నర్ ప్రసంగం కస్టమరీ సెషన్ మాత్రమేనని, స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాన్నే వర్కింగ్ డేగా పరిగణిస్తారని అసెంబ్లీ అధికారులు చెబుతున్నారు.
ఒకవేళ శాసనసభకు రాకపోతే సీటు వేకెంట్ అని ప్రకటించవచ్చని అంటున్నారు. దీంతో జగన్ మరోసారి అసెంబ్లీకి రాక తప్పదని సమాచారం.