మీ కేసులకు భయపడేది లేదు: జగన్
కేసులకు భయపడేది లేదంటూ వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మిర్చి రైతులు సంక్షోభంలో ఉంటే తాము స్పందించే వరకు ప్రభుత్వంలో కదలిక రాలేదని సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ జగన్ ట్వీట్ చేశారు.
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ రైతుల కోసమే అన్నట్లు కలరింగ్ ఇచ్చారని తెలిపారు. "ఎప్పుడూ మిర్చి కొనని నాఫెడ్ కొనాలంటూ కేంద్రానికి లేఖ రాయడం ఏంటి? రైతులకు బాసటగా నిలిస్తే మాపై కేసులు పెట్టారు. మీ కేసులకు భయపడేది లేదు. వెంటనే మిర్చి కొనుగోళ్లు ప్రారంభించండి" అని ఆ ట్వీట్ లో కోరారు.