జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే
జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే చేరనున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరనున్నట్లు సమాచారం. కాసేపటి క్రితం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పవన్ ను కలిశారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరికపై చర్చించినట్టు తెలుస్తోంది. వారం రోజుల్లో ఆయన జనసేన తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. గత ఎన్నికల్లో తనను కాదని వంగా గీతకు టికెట్ ఇవ్వడంతో దొరబాబు ఆగష్టులోనే వైసీపీకి రాజీనామా చేశారు.