వైసీపీని వీడిన మరో కీలక నేత: జగన్ కు మరో షాక్

Politics Published On : Friday, December 27, 2024 09:38 PM

అధికారం కోల్పోయిన వైసీపీ పార్టీని సీనియర్ నాయకుల నుండి చోటా మోటా నాయకుల వరకూ ఒక్కొక్కరూ పార్టీని వీడుతున్నారు. ఒక్కక్కరు ఒక్కో కారణాలను బూచిగా చూపుతూ పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీలో చేరడం లేదా.. రాజకీయాల నుండి శాశ్వతంగా నిష్క్రమిస్తున్నట్లు చెబుతూ వైసీపీ పార్టీకి దూరమవుతున్నారు.

తాజాగా, కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నాయకులు, మాజీ ఐఏఎస్ అధికారి వైస్సార్ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుని స్వచ్ఛంద సంస్థలు మరియు వ్యక్తులతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.