చంద్రబాబుని అతి దారుణంగా వాడేసుకుంటున్నారు.. చేయని తప్పుకు నిందితుడయ్యాడు!!
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో దీనికి కారణం చంద్రబాబేనని వైసిపి వాళ్లు ఆయన్ను తిడుతుంటే.. మా బాబు గురించి తక్కువ అంచనా వెయద్దు, అయన వ్యుహాల ధాటికి జగన్ ఎంత ?? ఆఫ్ట్రల్ ఆయన అనుభవం అంత లేదు ఈ ముఖ్యమంత్రి వయసు.. అని ఆయన అభిమానులు చిటికెలు వేస్తున్నారు. అయితే ఈ వాయిదా నిర్ణయం వెనుక అసలు కారకులైన డిల్లీ లోటస్ పార్టీ పెద్దలు మాత్రం ఎమీ తెలియనట్టు సైలెంట్ గా కూర్చోని ఈ గొడవ ఎంజాయ్ చేస్తున్నారు.
కాకపొతే ఆప్పుడెప్పుడొ తెలుగులో రామ్ హీరోగా వచ్చిన 'రెడీ' మూవీ లో అనుకుంటా.. ఆ సినిమాలో బ్రహ్మానందం గారి పాత్రని క్రియేటర్.. క్రియేటర్.. అని పైకి లేపుతుంటే.. నేను క్రియేటర్ ని కాదురా బాబూ.. అని బ్రహ్మానందం ఎంత మొత్తుకున్నా ఎవరు నమ్మక పోవడంతో.. ఒక దశలో నిజంగా నేనే క్రియేటర్ ని ఎమో అన్న డౌట్ కుడా వచ్చి.. చివరికి నేనే క్రియేటర్ అని బ్రహ్మానందం ఫిక్స్ అయిపోతాడు!! ఈ మొత్తం వ్యవహారం చూశాక అందరూ ఆయన్ని విజనరీ.. విజనరీ.. అంటూ ఆ ఆ ఎన్నికల వాయిదా క్రెడిట్ చంద్రబాబు కే ఇస్తుంటే ఆ సినిమాలో బ్రహ్మానందం గారి క్రియేటర్ పాత్ర గుర్తుకువస్తుంది!!
ఏది ఎమైనా ఇక్కడ మర్డర్ చేసింది ఒకరైతే.. కత్తి మీద వేలి ముద్రలు మాత్రం చంద్రబాబువి!!