టీడీపీ - జనసేన మధ్య వార్... స్పందించిన పార్టీ కార్యాలయాలు
టీడీపీ, జనసేన నాయకుల వార్..స్పందించిన జనసేన కేంద్ర కార్యాలయం
ఏపీలో టీడీపీ, జనసేన నాయకుల మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాన్ని ఆపేందుకు ఇరు పార్టీలు సమాయత్తమయ్యాయి. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించవద్దని తాజాగా జనసేన కేంద్ర కార్యాలయం నాయకులకు, కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎవరూ మీడియాలో, సోషల్ మీడియాలో స్పందించవద్దని ఆదేశించింది. ఇటీవల మంత్రి నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖలు చేయడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.