చిన్నారికి ముద్దు పెట్టిన జగన్.. మొదలైన రాజకీయ దుమారం..
మంగళవారం ఓ చిన్నారి వైఎస్ జగన్ ను కలవాలని ఏడవడం, ఆయన తన కాన్వాయ్ ఆపి ఆమెను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై రాజకీయ దుమారం మొదలైంది.
జగన్ అంటే ఆప్యాయతకు చిరునామా అని, ఇలాంటి ప్రేమ పొందే నాయకులు చాలా అరుదుగా ఉంటారని వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. అయితే ఇదంతా ముందే ప్లాన్ చేశారని, రాజకీయాల కోసం పిల్లలను వాడుకోవడం ఏంటని కూటమి అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఇరు వర్గాల మధ్య రాజకీయ పోరు నడుస్తోంది.