పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన కూటమి ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ. జీవిత కాలంలో ఒక్కసారి ఆయన ఎమ్మెల్యే అయ్యారంటూ సెటైర్లు వేశారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ అయ్యింది. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సెవెన్ అంటూ ఊదరగొట్టారు. చంద్రబాబు దత్తపుత్రుడు కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు.ఇప్పుడు చేతులెత్తేశారని మండిపడ్డారు.