లోకేష్ డిప్యూటీ సీఎం.. పవన్ సీఎం..
నారా లోకేష్ కు డిప్యూటీ సిఎం పదవి ఇవ్వాలనే అంశంపై సోషల్ మీడియాలో వార్ కొనసాగుతూనే ఉంది. జనసేన నేతలు, పవన్ అభిమానులు టీడీపీని టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. "ఔను నిజమే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేసి పవన్ కళ్యాణ్ ను సీఎంగా చేయాలి. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి" అంటూ జనసేన నేతలు సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తున్నారు.