ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి.. గెలుపు మనదే: కేసీఆర్

Politics Published On : Tuesday, February 11, 2025 10:40 PM

తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇవాళ ఎర్రవల్లి ఫామ్హహౌస్లో కేసీఆర్ ను కలిశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ స్టేషన్ ఘన్పూర్లోనూ ఉపఎన్నిక వస్తుందని కడియం శ్రీహరి ఓడిపోయి రాజయ్య గెలుస్తారని జోస్యం చెప్పారు. ఉప ఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు.