తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం

Politics Published On : Wednesday, March 5, 2025 10:34 PM

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కాంగ్రెస్ పార్టీలోని నేతలను 3 కేటగిరీలుగా విభజించాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్ణయించారు.

మొదటి నుంచి కాంగ్రెస్లోనే ఉన్నవారు ఒక గ్రూప్, ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారు రెండో గ్రూప్, ప్రభుత్వం ఏర్పడ్డాక పార్టీలోకి వచ్చిన వారిని మూడో గ్రూపుగా విభజించనున్నారు. పార్టీ, నామినేటెడ్ పదవుల భర్తీలో కేటగిరీల వారీగా ఆయా నేతలకు ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది.