నాకు రోజుకో అమ్మాయి కావాలి: కిరణ్ రాయల్ ఆడియో వైరల్
తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కిరణ్ రాయల్ నిజస్వరూపాన్ని లక్ష్మి అనే మహిళ బయటపెట్టారు. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. బాధిత మహిళతో కిరణ్ రాయల్ సన్నిహితంగా ఉన్న వీడియో సైతం బయటకు వచ్చింది.
ఇదిలా ఉంటే బాధితురాలు లక్ష్మితో కిరణ్ రాయల్ మాట్లాడిన ఆడియో కాల్ రికార్డ్‌ను వైసీపీ తమ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆడియో క్లిప్‌లో కిరణ్ రాయల్ మాట్లాడుతూ..''నాకు అమ్మాయిలు వీక్ నెస్ ఉంది. నేను లైఫ్ లాంగ్ ఇలానే ఉంటా. నేను మారలేను. కానీ, నిన్ను మాత్రం బాగా చూసుకుంటా" అని చెప్పారు. నా కూతూరు మీద ఒట్టు. నేను చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకున్నా. నీకు 10 ఏళ్ల వయసు ఉండొచ్చేమో.. అప్పుడు రోజుకో అమ్మాయితో తిరిగే వాడ్ని. నీకు తెలిసి నలుగురి గురించే తెలుసు. కానీ, నీకు తెలిసిన ఆరుగురితో నేను తిరిగాను. ఈ ఏడు నెలల్లోనే ఆరుగురితో తిరిగా. ఇప్పటికీ ఇద్దరు అమ్మాయిలతో వాళ్ల ఇంటికి వెళ్తాను. మొత్తంగా నాకు ఓ 400 మందితో సంబంధం ఉండొచ్చని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు.కూటమి ప్రభుత్వం రాగానే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అని కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.