జనం తీరుపై ఏపీ సర్కార్ సీరియస్, షాపింగ్ సమయాల కుదింపు, కొత్త టైమింగ్స్ ఇవే.
ఏపీలో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల నుంచి తగిన సహకారం లభించకపోవడమే ఇందుకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం నిత్యావసరాల కొనుగోళ్ల కోసం 7 గంటల సమయం ఇచ్చినా సామాజిక దూరం పాటించకుండా ఎగబడుతుండడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఏపీలో కరోనా వైరస్ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో సామాజిక దూరం పాటించకపోవడం తీవ్ర నేరమని అధికారులు చెప్తున్నారు.
ఏపీలో నిత్యావసరాల కొనుగోళ్ల కోసం ప్రజలు భారీగా ఎగబడుతున్న నేపథ్యంలో సమయాన్ని పెంచిన ప్రభుత్వం దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అంటుంది . దీంతో ప్రస్తుతం అనుమతిస్తున్న సమయాన్ని మూడు గంటల మేర కుదించేందుకు సిద్దమైంది. రేపటి నుంచి ఉదయం నాలుగు గంటలు మాత్రమే నిత్యావసరాల కొనుగోళ్లకు ప్రజలను అనుమతించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ మాత్రమే ఉన్న నిత్యావసరాల కొనుగోలు చేయాలి .