జగన్.. మీ తండ్రి వైఎస్ఆర్ కాకపోతే.. కౌన్సిలర్ కూడా కాలేవు: మంత్రి దుర్గేశ్
కాకినాడ జిల్లా చిత్రాడలో నిర్వహించిన జనసేన జనకేతనం సభలో వైసిపిపైనా, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పైనా మంత్రి కందుల దుర్గేశ్ విమర్శల వర్షం కురిపించారు. తమ నాయకుడిని వైఎస్ జగన్ కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అన్నారని గుర్తు చేశారు.
"మీ తండ్రి రాజశేఖర రెడ్డి కాకపోతే నువ్వు కనీసం కౌన్సిలర్ కూడా అయి ఉండేవాడివి కాదు.." అంటూ వ్యాఖ్యలు చేశారు. పవన్ తన వెనుక ఉన్నవారిని చూసి రాలేదని, కేవలం తన ముందున్న ప్రజలకోసం, వెంట నడుస్తున్న జనసైనికుల కోసమే రాజకీయాలు నడిపారని చెప్పారు.