ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా కొణిదెల నాగబాబు
జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును జనసేన ఎట్టకేలకు ప్రకటించింది. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నాగబాబు పేరును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. ఏపీలో శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు జనసేన ట్విట్టర్ వేదికగా వివరాలను వెల్లడించారు.