డిప్యూటీ సీఎం పదవిపై మరో సారి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
డిప్యూటీ సీఎం పదవిపై మంత్రి నారా మంత్రి లోకేశ్ మరో సారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో డిప్యూటీ సీఎం అవ్వబోతున్నారా? అని ఓ టివి ఛానల్ కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
రాష్ట్రంలో ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. వారికి ఎవరు నాయకత్వం వహించాలో ప్రజలే డిసైడ్ చేస్తారని, చంద్రబాబు కాదని చెప్పారు. 1985 నుంచి టీడీపీ గెలవని చోట తాను పోటీ చేసి విజయం సాధించానని అన్నారు. విద్యా శాఖ చాలా టఫ్ అంక్, కానీ తాను దానినే ఎంచుకున్నానని తెలిపారు.