విజయసాయి రెడ్డి రాజీనామాపై స్పందించిన లోకేష్
వైసిపి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తన సొంత తల్లి, చెల్లినే నమ్మని వైఎస్ జగన్ వేరెవరినీ నమ్మరని, అందుకే విజయసాయి వంటివారు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారని తెలిపారు.
"మా పార్టీని, కార్యకర్తల్ని విజయసాయి చాలా ఇబ్బంది పెట్టారు. అలాంటి వ్యక్తిని మా పార్టీలోకి ఎందుకు తీసుకుంటాం?" అని చెప్పారు. విశాఖలో ఆయన అక్రమాలపై ఒక్కొక్కటిగా విచారణ చేస్తున్నామని తెలిపారు.