Breaking: హిందీ భాషా వివాదంపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
హిందీ భాషా వివాదంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో కీలక ప్రకటన చేశారు. తాను హిందీ భాషను ఎప్పుడూ వ్యతిరేకించలేదని తెలిపారు. దాన్ని నిర్బంధంగా అమలు చేయడాన్నే వ్యతిరేకించానని ట్వీట్ చేశారు. NEP-2020 (జాతీయ విద్యా విధానం) హిందీని తప్పనిసరి చేయాలని చెప్పలేదని, కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు.
ఆ పాలసీ ప్రకారం మాతృభాష, మరో భారతీయ భాష, ఒక అంతర్జాతీయ భాష నేర్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. హిందీని చదవడం ఇష్టం లేకపోతే మిగతా భాషలు నేర్చుకోవచ్చని సూచించారు. దేశంలో బహు భాషలు అవసరమని శుక్రవారం జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.