భాషా వివాదం: పవన్ కళ్యాణ్ మరో సంచలన ట్వీట్
జనసేన జయకేతనం సభలో దేశానికి బహు భాషలు అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అప్పటి నుండి హిందీ భాషా వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా అదే విషయంపై ఆయన సంచలన ట్వీట్ చేసారు.
'ఉత్తరాదినున్న హిమాలయాల్లో ఉంది 'పరమశివుని' కైలాసం. దక్షిణాది ఆయన కుమారుడు 'మురుగన్' నివాసం. వారు వెలిసిన ప్రదేశం ఈ 'భారతదేశం'. ఇది జగన్మాత ఆదేశం' అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఉత్తర భారతానికి, దక్షిణాదికి తేడా లేదని చెప్పేందుకు పవన్ ఈ ట్వీట్ చేసినట్లు ఆయన అభిమానులు అంటున్నారు. మరో వైపు ఈ ట్వీట్ పై పలువురు నుండి ఆగ్రహం కూడా వ్యక్తం అవుతోంది.