జగన్ లక్ష్యంగా దూకుడు పెంచిన పవన్ కళ్యాణ్

Politics Published On : Tuesday, December 31, 2024 04:12 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్ లక్ష్యంగా దూకుడు పెంచారు. గాలవీడు ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఫ్లైట్లో అక్కడికి వెళ్లి ఎంపీడీవోను పరామర్శించారు. వైఎస్ జగన్ ను టార్గెట్ చేసిన పవన్... మీ వారిని కంట్రోల్ లో పెట్టుకో అంటూ సూటిగా చెప్పారు. వైసీపీ వాళ్లు ఇంకా జగన్ నే సీఎం అనే భ్రమలో ఉన్నారని, రాయలసీమ వైసీపీ జాగీరు కాదని మండిపడ్డారు. పరిస్థితులు ఇలాగే ఉంటే కడపలో క్యాంప్ ఆఫీసు పెట్టుకుని మరీ లెక్కలు సరిచేస్తానంటూ చెప్పారు. అయితే, పవన్ కళ్యాణ్ కామెంట్ల వెనక ఆయన వ్యూహమేంటని రాయలసీమలో చర్చ జరుగుతోంది.