గోరంట్ల మాధవ్‌కు పోలీసుల పిలుపు
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు వెళ్ళారు. మాధవ్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు. వచ్చే నెల 5న సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసు అందజేశారు. 2024లో వాసిరెడ్డిపద్మ ఇచ్చిన ఫిర్యాదుతో నోటీసులు అందజేసినట్లు తెలుస్తోంది.
పోక్సో కేసులో బాధితురాలి పేరు చెప్పారని మాధవ్ పై ఆరోపణ ఉన్నాయి. దాంతో గోరంట్ల మాధవ్‌పై 72, 79 BNS కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి విచారణకు రావాలని ఈ రోజు నోటీసులు అందించారు.