పవన్ కల్యాణ్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్
దేశానికి బహు భాషలు అవసరం అని జనసేన జయకేతనం సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. అలాంటప్పుడు తమిళ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేయవద్దన్నారు. ఈ వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు.
హిందీ భాషను తమ పై రుద్దకండి అంటూ చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని ఆయన ట్వీట్ చేశారు. " స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్" అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.