రాష్ట్రపతిపై రాహుల్, సోనియా వివాదాస్పద వ్యాఖ్యలు
పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీసింది. రాష్ట్రపతి ప్రసంగం 'వెరీ బోరింగ్. నో కామెంట్' అని రాహుల్ అన్నారు. ఇక సోనియానేమో 'పూర్ లేడీ. చదివీ చదివీ చివరకు అలసిపోయారు. అంత చదవాల్సింది కాదు' అని చెప్పారు.
రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ ఆదివాసీలను అవమానించడం కాంగ్రెస్కు అలవాటేనని బిజెపి నేతలు మండిపడ్డారు. దేశ విజన్ ను వివరించిన ఆమెను అవమానించడం దారుణమని పేర్కొన్నారు.