రాత్రికి రాత్రే YSR పేరు తొలగించిన టీడీపీ ప్రభుత్వం
ఏపీలో కూటమి నాయకుల ఉన్మాదం పతాక స్థాయికి చేరిందని వైసీపీ ఆరోపించింది. వైజాగ్ క్రికెట్ స్టేడియానికి ఉన్న YSR పేరును టీడీపీ నేతలు తొలగించారు. రాత్రికి రాత్రే డా. వైఎస్సార్ ACA VDCA క్రికెట్ స్టేడియంగా ఉన్న పేరును ACA VDCA క్రికెట్ స్టేడియంగా మార్చారు.
గతంలో వైజాగ్ ఫిలింనగర్ క్లబ్లోని లాన్కు ఉన్న వైఎస్సార్ పేరును కూడా తొలగించారు అని వైసిపి ట్విట్టర్ లో ఆ ఫొటోలు పోస్ట్ చేసింది.